Chandrababu: పల్నాడు జిల్లాలో పెన్షన్లు పంపిణీ చేయనున్న సీఎం...! 6 d ago
AP : ఈనెల 31న పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. మంగళవారం యల్లమందలోని పెన్షన్ల పంపిణీలో పాల్గొననున్నారు. ఉదయం 11:35 గంటలకు లబ్ధిదారులతో చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. అనంతరం అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమావేశం కానున్నారు. రేపు మధ్యాహ్నం 1:45 గంటలకు కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామిని చంద్రబాబు దర్శించుకోనున్నారు.